- పది తలల రావణాసురలో అయిదుగురు హీరోయిన్లు
అభిషేక్ పిక్చర్స్, ఆది టీం వర్క్స్ బ్యానర్లపై సుధీర్ వర్మ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా భారీ స్థాయిలో నిర్మిస్తున్న చిత్రం “లావణు సుర”, ఇందులో లాయర్ పాత్రలో మాస్ మహారాజు రవితేజ కనిపించనున్నాడు. అలాగే సుశాంత్ కూడా చిత్రంలో ఓ కీలక పాత్ర చేస్తున్నారు. వీరిద్దరి ఫస్ట్ లుక్స్ ఇప్పటికే విడుదలైంది. దానికి సూపర్ ట్రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో ఐదుగురు హీరోయిన్లు ఉన్నారు. అను ఇమాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్బుల్లా, దక్ష నగార్కర్, పూజిత పొన్నాడ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి పవర్ ఫుల్ కథతో పాటు మాటలు, స్క్రీన్ ప్లేని శ్రీకాంత్ విస్సా అందించారు. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు.