బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించిన సీఎం కేసీఆర్ తెలంగాణ ఆడపడుచులకు పెద్దపీట వేస్తున్నారని, అలాగే రాష్ట్రానికే పెద్దన్న పాత్ర పోషిస్తూ.. అందరిని ఆడుకుంటున్నారని ఈ పీ సీ ఎస్ వైస్ చైర్మన్ సోల్తి భూమాత అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాంప్రదాయమైన పండుగ బతుకమ్మ పండుగ అని ఆమె తెలిపారు. గ్రేటర్ వరంగల్ పరిధిలోని 17వ డివిజన్ బొల్లికుంటలో ఆడపడుచులకు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈకార్యక్రమానికి ఆమె ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
ఈసందర్బంగా ఏపీటీస్ బ్రేకింగ్ న్యూస్ తో భూమాత మాట్లాడుతూ… మన ఆచారం ప్రకారం మన ఇంటి ఆడపడుచులకు పండగవేళ కొత్త బట్టలు ఎలాగైతే కొని పెడుతామో… అలాగే సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఆడపడుచులకు ఒక పెద్దన్న పాత్ర పోషిస్తూ… చీరల పంపిణి కార్యక్రమానికి శ్రీకర చుట్టారని ఆమె వివరించారు. ఆడపడుచులందరు తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి ఆడుతూ పాడుతూ ఆనందోత్సవాల నడుమ జరుపుకునే బతకమ్మ వేడుకలు పల్లెల్లో ప్రత్యేకత చాటుతాయన్నారు. ప్రకృతిని ఆరాధిస్తూ తొమ్మిది రోజుల పాటు సాగే ఉత్సవాల సందర్భంగా గ్రామ ప్రజలు సంస్కృతిక సంబరం గొప్పగా వెల్లువిరుస్తుందని ఆమె తెలిపారు.
కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ తుమ్మ రవీందర్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ నాయకుడు రామస్వామి గౌడ్, టీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు బొజ్జమ్ సుధాకర్,డివిజన్ యూత్ అధ్యక్షుడు సోల్తి నరేందర్ గౌడ్, మహిళా అధ్యక్షురాలు జంపాల తిరుమల , డివిజన్ ఉపాధ్యక్షులు సుతారి శ్రీధర్, ఆర్పీలు సరితా, పద్మ, శ్రీలత,మమతా,సుజాత,అంకిత , కవిత, కుమార్ స్వామి, రామ్, టోనీ, భరత్, రవీందర్, రఫీ, బన్న రాజు, తదితరులు పాల్గొన్నారు..