Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

ఆస్ట్రేలియాపై ఓడినా …సరికొత్త రికార్డు సృష్టించిన భారత్!

ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ లో భాగంగా టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన టీమిండియాకు అశినంత శుభారంభం దక్కలేదు. ఫలితంగా తొలి మ్యాచ్ లో ఓటమిపాలైంది. తొలి ఐదు ఓవర్ల లోపే రోహిత్ శర్మ 11 పరుగులు, కోహ్లీ 2 పరుగులు చేసి ఔటయ్యారు. దీంతో భారత్ కి ఈ మ్యాచులోనూ బ్యాటింగ్ కష్టాలు తప్పవేమో అనుకున్నారు. కానీ గత కొంతకాలంగా బ్యాటింగ్ లో పూర్తి నిరాశపరుస్తున్న కేఎల్ రాహుల్.. 55 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. తన ఫామ్, స్ట్రైక్ రేట్ పై మ్యాచ్ కి ముందురోజు విమర్శకులకు సమాధానమిచ్చిన రాహుల్.. మ్యాచ్ లో బ్యాటింగ్ తో అదరగొట్టాడు

మరోవైపు వచ్చీరావడంతోనే ధనాధన్ షాట్లతో అలరించిన సూర్యకుమార్ యాదవ్ కూడా 25 బంతుల్లో 46 పరుగులు చేశాడు. ఇక 12 ఓవర్ చివర్లో వచ్చిన హార్దిక్ పాండ్య అయితే చితక్కొట్టుడు అనే పదాన్ని గ్రౌండ్ లో చూపించాడు. చివరి 8 ఓవర్లలో క్రీజులో ఉన్న హార్దిక్.. 30 బంతుల్లో 71 పరుగులు చేసి.. జట్టు 208 స్కోరు చేయడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియాపై సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. టీ20ల్లో ఆసీస్ జట్టుపై భారత్ కి ఇదే అత్యధిక స్కోరు. ఇదిలా ఉండగా టీమిండియా బ్యాటింగ్ పరంగా ఆకట్టుకుంటున్న ఫీల్డింగ్, బౌలింగ్ విషయాల్లో మాత్రం తేలిపోతోంది. మరి ఓడినా సరే ఆసీస్ పై రికార్డు నమోదు చేయడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.

RSS
Follow by Email
Latest news