Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

అంబులెన్స్ మాఫియా ఆగడాలు…కన్నబిడ్డ శవంతో బైక్ పై 90KM ప్రయాణం…

వారు అడిగినంత డబ్బులు ఇవ్వాల్సిందే… వేరే వాళ్ళు తక్కువ రేటుకు బాడుగకు వస్తే ఊరుకోరు. ఆలా వచ్చినపై దాడి చేయడం, అక్కడ నుండి పంపించివేయడం. ఇది రుయా ఆసుపత్రి వద్ద గల అంబులెన్స్ మాఫియా పరిస్థితి. తాజా ఘటన ఇందుకు నిదర్శనం తిరుపతి రూయా ఆసుపత్రి లో అనారోగ్యంతో ఓ వ్యక్తి మరణించారు. సదరు వ్యక్తి డెడ్ బాడీని అతని సొంత ఊరికి తరలించడానికి 20వేలు అడిగారు. మరణించిన వ్యక్తి సొంత ఊరు అన్నమయ్య జిల్లా చిట్వేలి. తిరుపతికి 90km దూరం ఉంటుంది.

కన్నబిడ్డ చనిపోయి పుట్టెడు ముఖంలో ఉన్న తండ్రి అంబులెన్స్ మాఫియాకు డిమాండ్ చేసిన 20వేలు చెల్లించుకోలేక బాధలు వర్ణనాతీతం. చివరికి ఎలాగోలా బయటనుంచి ఓ అంబులెన్స్ ను తక్కువ రేటుకు  మాట్లాడుకుని ఆసుపత్రి వద్దకు తీసుకు వచ్చారు. కానీ అక్కడున్న రుయా అంబులెన్స్ మాఫియా … సదరు అంబులెన్స్ డ్రైవర్ పై దాడికి పాల్పడి అక్కడనుంచి పంపించివేశారు.

చివరకు గత్యంతరం లేక ఆ రాత్రివేళ… గుండెలవిసేలా రోదిస్తూ… బైక్ పై కన్నబిడ్డ శవంతో 90KM ప్రయాణానికి సిద్ధపడ్డా… అందరూ…. చూస్తూ నిలబడ్డారే కానీ… సాయానికి ఒక్కరూ ముందుకు రాకపోవడం సిగ్గుచేటు… చనిపోయింది ఆ పసివాడు మాత్రమే కాదు… అక్కడ కళ్ళప్పగించి చూస్తున్న జీవచ్ఛవాలు…తలదించుకునే ఘటన ఛీ సిగ్గు సిగ్గు, మన సమాజం ఎటుపోతుంది.

ఈ పరిస్థితి కేవలం ఆ జిల్లాలోనే మాత్రం కాదు ఆంధ్రప్రదేశ్ లో ని మొత్తం 26 జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద ఇలాంటి పరిస్థితులే ఉంటున్నాయని సమాచారం. ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద అంబులెన్స్ మాఫియా బైఠాయించి వాళ్లకు వాళ్లే యూనియన్లు స్థాపించుకొని బయటి వారికి ఎటువంటి అవకాశం లేకుండా ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తున్నటువంటి పేద ప్రజల వద్ద నుంచి వేల రూపాయలు దోచుకుంటున్న అంబులెన్స్ మాఫియా ఆగడాలకు చెక్ పెట్టాలంటే సీఎం జగన్ దృష్టికి చేరేలా అందరూ తమ తమ గ్రూప్ ల్లో షేర్ చేయండి.

RSS
Follow by Email
Latest news