Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర నేడు 29వ రోజుకు చేరుకుంది. ఈరోజు ఆ పాదయాత్ర చంద్రగిరి నియోజకవర్గంలో కొనసాగుతోంది. నేడు తొండవాడలో ఏర్పాటు చేసిన సభలో లోకేష్ మాట్లాడారు. నేడు వెంకటేశ్వరస్వామి పాదాల చెంతన నిలబడి మీతో మాట్లాడడం నిజంగా ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను అని అన్నారు. విజయనగరం సామ్రాజ్యంలో  ఒక వెలుగు వెలిగిన ఈ గడ్డ చంద్రగిరి గడ్డ అని పేర్కొన్నారు. ఎంతో గొప్ప చరిత్ర ఉన్న ఈ నియోజకవర్గంలో నేడు ల్యాండ్, శాండ్, వైన్, మైన్, ఎర్రచందనం మాఫియా పేట్రేగిపోతోందని మండిపడ్డారు.

ప్రసంగం హైలైట్స్…

•  తాడేపల్లి ప్యాలెస్ లో పిల్లి 4 సంవత్సరాలు ఇంట్లో పడుకుని… యువగళం దెబ్బకు భయపడి పల్లెనిద్రకు వెళతానని అంటున్నాడు. యువగళం దెబ్బంటే ఇది !
•  నేను యువగళం ప్రారంభించే ముందే తాడేపల్లి పిల్లి జీఓ-01ను తెచ్చాడు. దాన్ని అడ్డంపెట్టుకుని నన్ను రోడ్డపై నిలబడనివ్వడం లేదు. మైక్ పట్టుకోనివ్వడం లేదు.
•  సౌండ్ వాహనాలు లాక్కుంటున్నారు. నేను నిలబడే స్టూల్ లాక్కుంటున్నారు.
•  జగన్ ది గవర్నమెంట్ ఆర్డర్… ఈ లోకేష్ ది పబ్లిక్ ఆర్డర్.
•  జగన్ గవర్నమెంట్ ఆర్డర్ తో నన్ను ఆపాలని చూస్తున్నారు… కానీ పబ్లిక్ ఆర్డర్ ను మాత్రమే నేను గౌరవించి మీ వద్దకు వస్తున్నాను.
•  గవర్నమెంట్ ఆర్డర్ తో నా దగ్గర వందలాది పోలీసులు, వజ్ర వాహనం, ఇంటెలిజెన్స్ వాళ్లను తిప్పుతున్నారు.
•  2019ఎన్నికల సమయంలో మీరు యువతకు ఇచ్చిన హామీలు 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రతియేటా 6500 పోలీసు ఉద్యోగాలు, మెగా డీఎస్సీ లను నెరవేరిస్తే నా సౌండ్ వెహికల్స్ స్వచ్చందంగా ఇచ్చేస్తా.
•  మహిళలకు ఇచ్చిన 45 ఏళ్లకే బీసీ,ఎస్సీ,ఎస్టీ మహిళలకు పెన్షన్, ఎంత మంది పిల్లలు ఉన్నా అమ్మ ఒడి, మద్యపాన నిషేధం లాంటి హామీలను నిలబెట్టుకుంటే నా మైక్ సరెండర్ చేస్తా.
•  పోలీసులకు జగన్ చాలా బాకీ పడ్డారు. పెండింగ్ లో ఉన్న 4 సరెండర్లు, 8 టీఏ, డీఏ బిల్లులు, మెడికల్ బిల్లులు ఇచ్చేస్తే నా స్టూల్ కూడా జగన్ రెడ్డి కి ఇచ్చేస్తాం.
•  జగన్ పాలనలో వైసీపీ నాయకులు దళితుల్ని చంపి డోర్ డెలివరీ చేస్తున్నారు.
•  దళితులను చంపి జైలు నుండి విడుదలైన వారికి పాలాభిషేకాలు, గజమాలలతో సత్కరిస్తున్నారు.
•  సుబ్రమణ్యంని చంపేసిన అనంతబాబుకి సన్మానాలు చేశారు.
•  డాక్టర్ సుధాకర్, కిరణ్, ఓం ప్రతాప్ వంటి దళితులను జగన్ రెడ్డి పొట్టనబెట్టుకున్నారు.
•  వరప్రసాద్ అనే దళిత యువకుడికి శిరోముండనం చేశారు.
•  జగన్ రెడ్డిది ఓ దరిద్రపు పాదం… ఆయన పాలనలో రాష్ట్రానికి అన్నీ అరిష్టాలే.
•  కచ్చులూరు బోట్ ప్రమాదం లో 51 మంది, ఎల్జీ పాలిమర్స్ ఘటనలో 15 మంది, అన్నమయ్య డ్యామ్ ఘటనలో 62 మంది చనిపోయారు.
•  రాయలసీమకు పట్టిన శని జగన్.
•  కడప జిల్లాకు స్టీల్ ఫ్యాక్టరీ లేదు. అప్పర్ తుంగభద్రకు రూ.5,300 కోట్లను కేంద్రం కేటాయిచింది. అప్పర్ తుంగభద్ర పూర్తయితే రాయలసీమ ఎడారిగా మారుతుంది.
•  అమర్ రాజా బ్యాటరీ కంపెనీని మన రాష్ట్రం నుండి జగన్ తరిమేశాడు… తెలంగాణ మంత్రి కేటీఆర్ అమర్ రాజా కంపెనీకి రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించాడు.
•  ఈ కంపెనీ మన రాష్ట్రం నుండి పోవడం వల్ల 20వేల మంది మన యువకులు ఉద్యోగాలు కోల్పోయారు.
•  జగన్ రెడ్డి ముసలోడి మాదిరిగా కొబ్బరికాయ కొట్టడానికి కూడా వంగలేకపోతున్నాడు.
•  వెయ్యి మంది పోలీసులు అడ్డుకున్నా, 7 కిలోమీటర్లు వేగంగా నడిచి సభ పెట్టిన యువకుడు చంద్రబాబు.
•  కలియుగదైవం వెంకటేశ్వరస్వామి ఆలయంలోని బోర్డు మెంబర్ పోస్టులను జగన్ అమ్ముకున్నాడు. నేర చరిత్ర ఉన్న వారిని కూడా బోర్డులో వేసి జంబో బోర్డు ఏర్పాటు చేసారు.
•  టీటీడీ భూములను కూడా జగన్ అమ్మాలని ప్రయత్నం చేశారు.
•  జబర్దస్త్ ఆంటీ, నారాయణస్వామి, చిత్తూరుజిల్లా వైసీపీ నాయకులు వెంకటేశ్వరస్వామి ఆలయం దర్శనం టిక్కెట్లను అమ్ముకుంటున్నారు.
•  తిరుమల కొండపై గంజాయి దొరికింది అంటే ఎంత దారుణమైన పరిస్థితి ఉందో అర్థం అవుతుంది.
•  సొంతబాబాయ్ ని చంపినవాడు, పేదవాళ్లను వేధించేవాళ్లు అందరూ సైకోలే. ఈ సైకోలు జిల్లాకొక పిల్ల సైకోలను తయారుచేస్తున్నారు.
•  ఉమ్మడి చిత్తూరు జిల్లాకి పెద్దిరెడ్డి ఒక సైకో. ల్యాండ్, శాండ్, వైన్, మైన్ మాఫియాలు అన్నీ పెద్దిరెడ్డి కనుసన్నల్లోనే అక్రమాలు జరుగుతున్నాయి.
•  చంద్రగిరిలో మూడు ‘సీ’ లు ఉన్నాయి. అవి 1.చంద్రగిరి 2. చెవిరెడ్డి. 3.చెవిలో పువ్వు.
•  చంద్రగిరిలో చెవిరెడ్డి కొండంత దోచుకుని ప్రజల చెవిలో పువ్వులు పెడుతున్నాడు.
•  చెవిరెడ్డి ఎమ్మెల్యే, తుడా చైర్మన్, టీటీడీ బోర్డు మెంబర్, ప్రభుత్వ విప్ అనే 4 పదవులు చేతిలో పెట్టుకుని దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు.
•  చెవిరెడ్డికి చీటీల ఎమ్మెల్యే అని పేరు ఉంది.
•  ఎక్కడ భూములు కనిపిస్తే అక్కడ చెవిరెడ్డి తమ్ముడు రఘు దోచుకుంటున్నాడు.
•  రూ.120 కోట్ల విలువగల 60 ఎకరాల భూమిని దోచుకున్నాడు.
•  చెరువుల భూములను దోచుకుంటున్నాడు. స్వర్ణముఖి నదిలో నుండి రోజుకు 300 ట్రక్కుల ఇసుక టిప్పర్లతో దోచుకుంటున్నాడు.
•  చంద్రగిరి నియోజకవర్గంలో పసుపుజెండా ఎగిరి 30 ఏళ్లు అయ్యింది…
•  చరిత్ర తిరగరాయండి… నానిని భారీ మెజారిటీతో గెలిపించండి… చంద్రగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం జెండాను ఎగురవేయండి.
•  చంద్రగిరిని అభివృద్ధి చేసే బాధ్యతను నేను తీసుకుంటా.
•  టీడీపీ అధికారంలోకి వచ్చాక చంద్రగిరిలో వరి, మామిడి రైతులకు గిట్టుబాటు ధర ఇస్తాం.
•  గాలేరు-నగరి, హంద్రీనీవా పూర్తిచేస్తాం… సాగు, తాగు నీరు ఇస్తాం.
•  వరదల్లో కొట్టుకుపోయిన వంతెనలను కట్టిస్తాం.
•  నిత్యావసర ధరలు, ఇసుక ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తాం.
•  మహిళలు, కార్మికులు, రైతులు, ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు అందరూ ఏకమై చంద్రబాబును సీఎం చేయండి.
•  నిరుద్యోగ యువతకు ప్రతి ఏడూ నోటిఫికేషన్ ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ప్రైవేట్ రంగంలో కంపెనీలు తెచ్చి ఉద్యోగాలు కల్పిస్తాం. స్వయం ఉపాధికి సహకారం           అందిస్తాం.
•  మీ సమస్యల్నింటినీ మేం పరిష్కరిస్తాం అని హామీ ఇస్తున్నాం.
•  మన బాధలు పోవాలంటే… బాబు రావాలి. సైకో పోవాలి….సైకిల్ రావాలి.

RSS
Follow by Email
Latest news